
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయంలో ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా పండిట్ వెట్రివేల్‌ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పండిట్ వెట్రివేల్ విజయ్‌కు వ్యక్తిగత జ్యోతిష్కుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ పదవి ఇవ్వడంతో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తనకు నమ్మకమైన వారికే కీలక బాధ్యతలు ఇస్తున్నారని అభిమానులు చెబుతుండగా.. జ్యోతిష్యంతో సంబంధం ఉన్న వ్యక్తికి అధికారిక హోదా ఇవ్వడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!