
సినిమాలు

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమిళనాడు సీఎంఓ అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగారు. సీఎంఓ ఖాతాల డీపీగా విజయ్ ఫోటోలను ఉంచడంతో అభిమానులు, ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ముందుగా సుమారు 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న తమిళనాడు సీఎంఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా, విజయ్ ఫోటో డీపీగా పెట్టిన కొద్ది గంటల్లోనే 16 లక్షల ఫాలోవర్స్‌ను దాటింది. అలాగే ఎక్స్ ఖాతాలో కూడా ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరగడం విశేషం. సోషల్ మీడియాలో విజయ్ ప్రభావం ఎంత బలంగా ఉందో ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!