

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. వడ్డేపల్లిలోని ఆయన నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు. భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు గులాబీ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
వినయ్ భాస్కర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హనుమకొండలో పోలీసుల నిఘా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, భట్టి విక్రమార్క హనుమకొండ పర్యటనలో భాగంగా కాజీపేటలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం మైరా స్కిన్ క్లినిక్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో జిల్లాలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!