

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు, 20న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులతో పాటు కో-ఆప్టెడ్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఈ నెల 14వ తేదీలోగా ఎన్నికల సమావేశాలకు సంబంధించిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో సభ్యులంతా తమ పార్టీ జారీ చేసిన విప్‌ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. మరోవైపు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!