

శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ రాకెట్‌ను ‘మిషన్ ఆగమన్’ పేరుతో విజయవంతంగా ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ భారతదేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌తో కలిసి వీక్షించారు.
ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో, స్కైరూట్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, తాను కూడా ఈ ప్రయోగాన్ని వీక్షించినట్లు చెప్పారు. స్కైరూట్ ఏళ్ల తరబడి చేసిన కృషికి ఇది గొప్ప ఫలితమని, ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!