

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని, ప్రజలను అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతోనే మాట్లాడినట్లు స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అసెంబ్లీలో తన ప్రసంగం పెరియార్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా జరిగిందని ఉదయనిధి తెలిపారు. ఎన్ని విమర్శలు వచ్చినా తాను భయపడబోనని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. సనాతన ధర్మానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అసమానతలు, అణచివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ‘సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అనే ఆయన వ్యాఖ్యలపై ప్రస్తుతం విస్తృత చర్చ కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!