
రాజకీయాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉంది. మొత్తం 140 స్థానాల్లో మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 71 కాగా, యూడీఎఫ్ ప్రస్తుతం 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) 38 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్స్ ఓటర్ల అభిరుచిలో మార్పును సూచిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే యూడీఎఫ్ సౌకర్యవంతమైన మెజారిటీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది ఫలితాల కోసం అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!