
సినిమాలు

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ – షిండే శివసేన మహాయుతి కూటమి గండికొట్టడంతో, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తొలిసారి స్పందించింది. ఈ ఎన్నికల్లో ఎదురైన పరాజయం రాజకీయ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేస్తూ, మరాఠా ప్రజలకు తగిన గౌరవం దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ వెల్లడించింది.
ఈ మేరకు శివసేన (యూబీటీ) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో స్పందిస్తూ, “యుద్ధం ఇప్పటితో ముగియలేదు. మరాఠా వ్యక్తులకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొంది. బీఎంసీ ఫలితాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే శిబిరం చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠను రేపుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!