
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సంచలన వీడియోను విడుదల చేసింది. మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు మద్దతు తెలుపుతూ లేఖపై సంతకం చేస్తున్న దృశ్యాలను విడుదల చేసినట్లు పార్టీ తెలిపింది. సీఎం అభ్యర్థిగా విజయ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని టీవీకే పేర్కొంది.
అంతేకాకుండా, ఆ లేఖను టిటివి దినకరన్ అనుమతితోనే అందించినట్లు కామరాజ్ చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం కొనసాగుతోంది. చిన్న పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!