
గాసిప్స్

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో విశేష పరిణామం చోటుచేసుకుంది. 1వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సుధాకర్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-సీపీఎం పొత్తు అభ్యర్థి, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, వార్డు ఓటర్లు సుధాకర్‌కు మద్దతు ప్రకటించారు.
రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విజయంతో చిట్యాల మున్సిపల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు సుధాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!