

గ్లోబల్ సమ్మిట్-2025 వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్–2047’ అనే దార్శనికతను ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.9% మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం జీడీపీలో సుమారు 5% వాటాను అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో దేశ జీడీపీలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (CURE), పెరి అర్బన్ (PURE), రూరల్ అగ్రికల్చర్ (RARE) అనే మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్, అలాగే జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల అభివృద్ధి నమూనాల నుంచి ప్రేరణ పొందామని అన్నారు. ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించేందుకు పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నిపుణులు ముందుకు రావాలని ఆయన కోరారు. చివరగా, “తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. Come and join the rise” అంటూ పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!