

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నంప్రభాకర్ కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మీరే స్వయంగా నిష్పక్షపాత విచారణ కోరాల్సిందని బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుట్ర జరుగుతోందని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేయకుండా చట్టపరంగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే డీజీపీకి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళా డీసీపీ స్థాయి అధికారిణి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో కుల, రాజకీయ అంశాలను తెరపైకి తేవడం సరికాదని పేర్కొంటూ, బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!