
టెక్నాలజీ

బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ప్రకటించిన 284 స్థానాల్లో బీఎన్పీ కూటమి 208 సీట్లు గెలుచుకోగా, జమాత్ కూటమి 69 సీట్లు, ఐఏబీ 1 సీటు, ఇతరులు 6 సీట్లు గెలిచారు. ఈ ఫలితాలతో బీఎన్పీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.
బీఎన్పీ వర్గాల ప్రకారం, తారిఖ్ రెహ్మాన్ రేపు (శనివారం) బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2024 లో ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు బీఎన్పీకి భారీ మద్దతు తెలిపారు. రెండు మూడవ వంతు సీట్లు గెలుచుకోవడంతో బీఎన్పీ దేశ రాజకీయాల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!