
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను సచివాలయంలో ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు కలిశారు. తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్ల రాజిరెడ్డి (సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), పోతుల కల్పన (సుజాత), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహా రెడ్డి (గంగన్న) సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. లొంగిపోయిన నేతల పునరావాసం, భవిష్యత్ కార్యాచరణ మరియు శాంతి భద్రతల అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!