
జనరల్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోరాడతామని హామీ ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోల ద్వారా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు.
బాధితుల తరఫున న్యాయపోరాటం చేయడానికి పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ధైర్యం కోల్పోవద్దని, ఓపికగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపించి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1998, 2008 డీఎస్సీల్లో కూడా న్యాయం జరిగిందని గుర్తు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!