
జనరల్

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తమిళనాడులో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. టీవీకే నేత విజయ్‌కు స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యా బలం లేదని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడే ఏ ప్రభుత్వం అయినా రాజకీయ ఒత్తిళ్లు, ఆకర్షణల కారణంగా అస్థిరంగా మారే అవకాశం ఉందని శ్రీధర్ వేంబు అన్నారు. తమిళనాడు మరింత మెరుగైన ప్రభుత్వానికి అర్హమని, ప్రజలే మళ్లీ నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి రావచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!