
న్యూస్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ఒక వ్యక్తి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఆధారపడి విచారణ జరుగుతోందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ దశలో సోనియా, రాహుల్ సహా ఇతర నిందితులు ఎఫ్ఐఆర్ కాపీ పొందేందుకు అర్హులు కాదని పేర్కొంది. అయితే, తదుపరి దర్యాప్తును కొనసాగించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసు బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ ఆదేశాల ఆధారంగా విచారణకు వెల్లడైందని కోర్టు స్పష్టం చేసింది.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!