
జనరల్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు సమాచారం. షిండే సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారు అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏక్‌నాథ్ షిండే, తమదే అసలైన శివసేన పార్టీ అని పునరుద్ఘాటించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగించేది తమ వర్గమేనని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, బాల్ థాక్రే వారసత్వ పరిరక్షణ కోసం తమ ప్రయాణం కొనసాగుతుందని షిండే స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!