

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీలోని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
గల్ఫ్ దేశాల్లో సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. వారి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడి భారత రాయబార కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సహాయం అవసరమైన వారు ఏపీ భవన్ హెల్ప్‌లైన్ 9871999430, ఏపీఎన్ఆర్టీఎస్ 0863-2340678 నంబర్లను సంప్రదించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన మరొక్కసారి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!