

ఖైరతాబాద్ ఉప ఎన్నిక టికెట్‌కు సంబంధించి తప్పుడు, గందరగోళం సృష్టించేలా కథనాలు ప్రసారం చేశారంటూ ‘సత్యాగ్రహి’ యూట్యూబ్ ఛానెల్‌పై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున ఫిర్యాదు నమోదైంది. దానం నాగేందర్ తరఫున ఆయన పీఏ శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దానంకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కదని, కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ సంబంధిత ఛానెల్‌లో కథనం ప్రసారమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కథనం ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ప్రజల్లో అయోమయం, గందరగోళం సృష్టించేలా ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సంబంధిత యూట్యూబ్ ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి చర్యలపై పరిశీలన చేపట్టినట్లు సమాచారం. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంశం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!