
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన బీజేపీ అగ్రనేతలను కలుసుకుని రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై అధిష్ఠానానికి వివరించనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలు మరియు రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన నివేదిక ఇవ్వనున్నారు.
అదే సమయంలో, బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదంపై కూడా హైకమాండ్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. రాంచందర్ రావు కేంద్ర నాయకత్వంతో జరిపే చర్చలు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!