

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ మైనారిటీ విభాగం సలహామండలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం మరో ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ఈ ఘటన ప్రభావితం చేసిందని, పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అలాగే భవిష్యత్ రాజకీయాల్లో మతపరమైన అంశాల కంటే సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలే ప్రధాన చర్చగా మారతాయని పేర్కొన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!