

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అనూహ్యంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోతోంది. సాంప్రదాయ ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే కూటములను వెనక్కి నెట్టడం రాజకీయంగా పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్, విజయ్ ఒంటరిగా పోటీ చేస్తేనే విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను కూడా సాధించగలదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ట్రెండ్స్ నేపథ్యంలో ఆయన మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయ అరంగేట్రంలో కిషోర్ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, డీఎంకే-ఏఐడీఎంకే ఆధిపత్యానికి చెక్ పెట్టి విజయ్ ‘కింగ్ మేకర్’ కాకుండా ‘కింగ్’గా ఎదిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!