
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారంపై ఇంకా స్పష్టత రాలేదు. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతు లేఖలు గవర్నర్కు ఇంకా అందలేదని సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మెజారిటీపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం టీవీకే బలం 116 వద్దే నిలిచినట్లు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117 కాగా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి మాత్రమే గవర్నర్కు మద్దతు లేఖలు అందినట్లు సమాచారం. పూర్తి మెజారిటీపై స్పష్టత లేకపోవడంతో విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!