
ఆరోగ్యం

జూన్ 14 నుంచి 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ‘సేన గళం’ కార్యక్రమం లక్ష్యాలు, దాని ఉద్దేశాలను దేశ ప్రజలకు వివరించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 150 మంది జనసేన ముఖ్య నాయకులు, ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. జనసేన సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ దృక్పథం, భవిష్యత్ కార్యాచరణను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాలు కీలక వేదికగా నిలవనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!