
గాసిప్స్

జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతల తీరుపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ తరఫున ఒక్కరు కూడా స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నిస్తూ, ఈ విషయంలో నాయకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
అన్నింటికీ తానే స్పందించాల్సి వస్తే పార్టీ నేతల పాత్ర ఏమిటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఆవేశంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని నాదెండ్ల మనోహర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన జనసేనలో అంతర్గత చర్చలకు దారితీసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!