

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. ఈ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 28 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రెండో విడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం విశేషం. అంతకుముందు రోజు ఈ నెల 31 న ఆర్థిక సర్వేను సభ ముందుంచే అవకాశం ఉంది. దేశ ఆర్థిక దిశను నిర్ణయించే ఈ బడ్జెట్‌పై సామాన్య ప్రజలు, పారిశ్రామిక వర్గాలు మాత్రమే కాకుండా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రజలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!