
గాసిప్స్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి తెలిపారు. ఈ తీర్మానానికి తనతో పాటు పలువురు ఎంపీలు ఇప్పటికే సంతకాలు చేశారని, మంగళవారం అధికారికంగా స్పీకర్‌కు సమర్పించనున్నట్టు చెప్పారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటులో ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి బీజేపీ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని స్పీకర్‌పై మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. సభను తరచూ వాయిదా వేస్తూ పార్లమెంటరీ నియమ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!