

ఈ వారం ప్రారంభంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తమపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు సాక్షి టీవీతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రచురితమైన వార్తలు, ప్రసారాలు, చర్చలు వంటి కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంస్థపై తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచారం చేయకుండా ఉండాలని కోర్టు సూచించింది. ఈ వివాదం రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఉద్భవించిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంస్థను లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం.
కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆరోపణలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా నారా లోకేష్ కూడా తనపై వచ్చిన పరువు నష్టం వార్తలపై సాక్షి పత్రికపై రూ.75 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసి న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు, కార్పొరేట్ సంస్థల మధ్య ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చగా, కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!