

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏపీలో ప్రస్తుతం గాడితప్పిన పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైసీపీ నేతలను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను గమనిస్తున్నారా అని ప్రశ్నిస్తూ, అవసరమైతే ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం కాపు సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని ముద్రగడ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. కాపు వర్గం ఆగ్రహంతో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమతోనే గతంలో మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు. ప్రజల సహనాన్ని పరీక్షించేలా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని లేఖలో హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!