

తెలంగాణలో పార్టీ బలహీనంగా ఎందుకు కొనసాగుతున్నదన్న విషయం పై బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడలేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల ఎంపీలతో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో మోదీ ఈ అసంతృప్తిని వెల్లడించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నా, తెలంగాణలో ఆ ప్రభావాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యారని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఇక పై అంతర్గత విభేదాలకు తావులేకుండా అందరూ కలిసి పనిచేయాలని ఆయన నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అయ్యేలా, గ్రాఫ్ పెరిగేలా సమన్వయంతో కృషి చేయాలని మోదీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వెనుకబడి ఉందని వ్యాఖ్య. ఈ విషయం పై ఆధారాలతో కూడిన వివరాలను చూపిస్తూ ఎంపీల పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!