

కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అధికారికంగా ఇది ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని చెబుతున్నప్పటికీ, సీఎం పదవి మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్న సమాచారం వెలువడింది. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి తనకు అప్పగిస్తారనే ఒప్పందం ఉందని డీకే శివకుమార్ వర్గం వాదిస్తోంది.
అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న 20 మందికి పైగా ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉండగా, వారు వచ్చే నెల 1 న తిరిగి రానున్నారు. మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని పేర్కొన్నారు. సీఎం మార్పు అవసరం వస్తే దళిత నేతకు అవకాశం ఇవ్వాలన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!