
న్యూస్

డల్లాస్లో జరిగిన భారీ తెలుగుదేశం ఎన్ఆర్ఐల సభలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు ప్రవాసులను “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్” అంటూ కొనియాడుతూ, వారి సహకారం మరచిపోలేనిదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి నిబద్ధత, శ్రమ వలననే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయం లభించిందని లోకేష్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ప్రస్తావించిన లోకేష్, రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు జరుగుతుందన్నారు. వికేంద్రీకృత అభివృద్ధి విధానంతో కీలక పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో మంచి వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. స్వదేశంతో బలమైన అనుబంధం కలిగిన ప్రవాసులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగమని, వారి పాత్రను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!