
క్రీడలు

ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో శాఖల వారీగా ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (కేపీఐ) ఆధారంగా ఈ ర్యాంకులు ఇవ్వబడినట్లు అధికారులు తెలిపారు.ఏ బీ సీ డీ విధానంలో వర్గీకరించిన ఈ ర్యాంకుల్లో అటవీ, పర్యావరణ శాఖకు చివరి స్థానం దక్కింది. ఈ శాఖ పవన్ కళ్యాణ్ పరిధిలో ఉండటంతో ఈ ఫలితాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
మొత్తం 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ మొదటి స్థానంలో నిలిచింది. అటవీ, పర్యావరణ శాఖకు కేవలం 67 పాయింట్లు మాత్రమే రావడంతో చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు, 90 శాతం పైగా పాయింట్లు సాధించిన 18 శాఖలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ర్యాంకింగ్ ద్వారా శాఖల పనితీరు స్పష్టంగా వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!