
క్రీడలు

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్-మల్కాజ్‌గిరి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్‌పై పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో జైలులో ఉన్నారు. ఈ సంచలన కేసులో లోతైన విచారణ కోసం పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు ఆమోదించి, మూడు రోజుల పాటు భగీరథ్‌ను విచారించేందుకు అనుమతించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!