
క్రీడలు

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కీలక బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభాపక్షాల ఉపనాయకులు హాజరుకానున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జ్ల నియామకం, పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, పార్టీ అంతర్గత సమన్వయం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రాధాన్యత పొందనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!