
క్రీడలు

వచ్చే నెలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే నెల 2 లోపు ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కుత్బుల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అమరుల స్థూపాన్ని వచ్చే నెల 2 లోగా ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో తామే ఆవిష్కరిస్తామని చెప్పారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తమ ప్రధాన లక్ష్యమని, ప్రైవేట్ స్కూల్స్ ఫీజు పెంపును అడ్డుకుంటామని తెలిపారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, యువతకు రుణాలు, సామాజిక న్యాయం అంశాలపై కూడా ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!