
క్రీడలు

కర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నాయకత్వ మార్పిడి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారం మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కీలక సమావేశంలో సీఎం మార్పిడి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సమావేశంలో కేవలం రాజ్యసభ ఎన్నికలపైనే చర్చ జరిగినట్లు వెల్లడించారు.
అయితే కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన లేకపోయినా, కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పిడి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!