
రాజకీయాలు

కేటీఆర్ కేంద్రమంత్రి బండి సంజయ్ ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘నా బూత్ – నా భవిష్యత్తు’ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో మాట్లాడిన ఆయన.. ఒక బాలికకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శించారు.
బాలికకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ, అనుబంధ సంఘాలు పోరాటం చేశాయని కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించకుండా నిష్పక్షపాత విచారణ జరగదని అన్నారు. నిందితుడిని దాచిపెట్టడం, బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం కేవలం మాటలకే పరిమితం కాకూడదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!