

ఇబ్రహీంపట్నం పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట ప్రాంతాల నుంచి ఎవరూ విజయవాడ వైపు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై నేతలు పోలీసులకు తమను అడ్డుకునే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ర్యాలీలు, ప్రదర్శనలు చేయరాదని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జగన్, జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి వారధి, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ మ్యాప్‌ను పోలీసులు రూపొందించారు. వారి విజ్ఞప్తి మేరకు జగన్ పర్యటన అదే మార్గంలో కొనసాగనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!