

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలలో 99 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీనేనని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోకు విలువ తీసుకువచ్చిన ప్రభుత్వం తమదేనని, ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నామని తెలిపారు.
వైసీపీ హయాంలో సంక్షేమ క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. దాదాపు మూడు లక్షల మంది గిరిజనులకు భూ పట్టాలు అందించడంతో పాటు 17 మెడికల్ కాలేజీలు, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ, రెండు ప్రభుత్వాల పనితీరును ప్రజలు పరిశీలించాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!