

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ–ఖమ్మం–వరంగల్ మరియు హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానాలకు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి సుమారు 14 లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల కోసం సెప్టెంబరులో ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు స్థానాలను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి స్థానానికి శివచరణ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు వినిపిస్తుండగా, నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి కైలాష్ నేత, చనగాని దయాకర్, గుత్తా అమిత్ రెడ్డి, సింగాపురం ఇందిర, పటేల్ రమేష్ రెడ్డి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!