
రివ్యూలు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల సందర్భంగా 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని చాక్లెట్ బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని వెనుక అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠా ఉందా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!