
జనరల్

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటలీ మీడియా సంస్థ “లా7”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, దీనిపై ఇటలీ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేశారు.
ఇటలీ రాజకీయ నాయకులు మెలోనీకి సంఘీభావం తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను ఆమె కల్పితమని పేర్కొంటూ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇటలీ ఎవరినీ ప్రాధేయపడదని స్పష్టం చేశారు. మిత్రదేశాల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమె అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఇటలీ నేతలు మండిపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!