
క్రీడలు

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సంఖ్యాబలం రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్యేల భద్రత దృష్ట్యా వారిని హైదరాబాద్కు తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో ఈ చర్య చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!