
జనరల్

ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనలు వరుసగా నాలుగో రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఇండియా కూటమికి చెందిన ఎంపీలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
సమావేశం అనంతరం ఎంపీలంతా పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, ర్యాలీ నిర్వహణపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!