
జనరల్

టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన కోసం ప్రత్యేక బంగ్లాను కేటాయించింది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లో ఈ బంగ్లాను కేటాయించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలు, అక్కడ బస చేసే సమయంలో ఆయనకు అనువైన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగ్లా కేటాయింపుతో పాటు అక్కడ అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దలైలామా భద్రతను దృష్టిలో ఉంచుకుని బంగ్లా పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఆధ్యాత్మిక గురువు ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయనకు అవసరమైన వసతి, భద్రత కల్పించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!