

వివాహం అనంతరం నిర్వహించే వధువు అప్పగింతల వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత పుట్టింటిని విడిచి భర్త ఇంటికి వెళ్లేందుకు ఓ వధువు నిరాకరించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా అప్పగింతల సమయంలో వధువు తల్లిదండ్రులు, తోబుట్టువులను విడిచి వెళ్లాల్సి రావడంతో భావోద్వేగానికి గురవుతుంది. అయితే ఈ వధువు మాత్రం పుట్టింటిని వదిలి వెళ్లేందుకు ససేమిరా అనడంతో అప్పగింతల వేడుక కాస్త భిన్నంగా మారింది.
సోదరి ఎంతకీ వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఆమె సోదరులు రంగంలోకి దిగారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించకుండా ఆమెను ఏకంగా ఎత్తుకుని బయట వేచి ఉన్న పెళ్లి కారువద్దకు తీసుకెళ్లారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న బంధువులు, అతిథులు నవ్వుకున్నారు. సాధారణంగా కన్నీళ్లతో జరిగే అప్పగింతల వేడుక కాస్త సరదా సంఘటనగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వధువు తీరుపై, సోదరులు చేసిన పనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!