

రామాయణ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, హిందీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదనే చర్చ మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకుండా దాదాపు 20 రోజుల సమయం లభించింది. అయినప్పటికీ ఇప్పటివరకు హిందీలో ₹1,000 కోట్ల వసూళ్ల మార్కును దాటకపోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ విషయంలో ఈ సినిమా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దురందర్2, పుష్ప 2, బాహుబలి2 సినిమాలు సాధించిన ఇండియా వైడ్ వసూళ్లను అధిగమించడం అంత సులభం కాదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ లేకుండా ఎక్కువ రోజులు ప్రదర్శితమైనా ఆశించిన వసూళ్లు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎంతవరకు పుంజుకుంటుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!