
న్యూస్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇటీవల విచారించింది. ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ స్వయంగా వెల్లడిస్తారని ఆమె అన్నారు.
ఇదే సమయంలో, ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఇప్పటికీ ముగింపుకు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణను త్వరగా పూర్తి చేసి, తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలని కోరారు. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు.
తనను సిట్ విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని కవిత స్పష్టం చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!